ETV Bharat / city

బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు నోడల్ కేంద్రంగా ఈఎన్‌టీ ఆస్పత్రి

author img

By

Published : May 15, 2021, 4:55 PM IST

Updated : May 15, 2021, 6:24 PM IST

black fungus in recovered corona patients in telangana

16:53 May 15

బ్లాక్ ఫంగస్ నిర్ధరణ అయిన కరోనా బాధితులకు గాంధీలో చికిత్స

రాష్ట్రంలో క్రమంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్స కోసం కోఠి ఈఎన్​టీ ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ బారిన పడి... కొవిడ్ పాజిటివ్​గా ఉన్న వారికి గాంధీలో చికిత్స అందించనునట్టు పేర్కొంది. ఫంగస్ సోకిన వారికి కంటి సమస్యలు తలెత్తితే సరోజిని దేవి ఆసుపత్రి వైద్యుల సహకారం తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు గాంధీ, సరోజినీ దేవి, కోఠి ఈఎన్​టీ ఆస్పత్రుల సూపరింటెండెంట్​లు సమన్వయంతో పని చేయాలని సూచించింది. 

మరోవైపు బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన మందులు సమకూర్చుకోవాలని టీఎస్​ఎంఐడీసీని ఆదేశించింది. మరోవైపు కొవిడ్ సోకిన వారిలో ఎక్కువగా  ఫంగస్ బారిన పడుతున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందించేటప్పడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వైరస్ సోకిన వారికి సరైన సమయంలో స్టిరాయిడ్​లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఫంగల్ మందులు ఇవ్వడమే కాకుండా... షుగర్ లెవల్స్​ని నియంత్రించడం, ఆక్సిజన్ థెరపీ ఇచ్చేటప్పుడు స్టేరైల్ నీటిని మాత్రమే వాడాలని తెలిపింది. బ్లాక్ ఫంగస్ రాకుండా ప్రభుత్వం సూచించిన ఆదేశాలు తప్పక పాటించాలని స్పష్టం చేసింది.

ఇదీచూడండి: ఆ కుర్రాడికి చెట్టే ఐసోలేషన్​ గది... ఎందుకంటే..!

Last Updated : May 15, 2021, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.