ETV Bharat / city

పెరుగుతున్న బ్లాక్​ఫంగస్​ కేసులు.. ఈఎన్టీలో పూర్తిస్థాయి వైద్యం

బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 వరకు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నట్టు సమాచారం. కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో క్రమంగా పడకలు నిండుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బ్లాక్​ఫంగస్‌కి అవసరమైన యాంఫొటేరిసిని-బి ఇంజక్షన్ కొరత సైతం రోగులను వేధిస్తోంది. ఇదే అదనుగా బ్లాక్‌మార్కెట్‌ దందాకు తెరలేపగా... ఫంగస్‌ లక్షణాలుంటే ఆందోళన చెందవద్దని ఉచిత చికిత్స అందుతుందని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.

black fungus cases increasing in telangana

author img

By

Published : May 20, 2021, 5:53 PM IST

బ్లాక్​ఫంగస్‌గా పిలిచే మ్యుకోర్ మైకోసిస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముందస్తుగా గుర్తించిన ప్రభుత్వం కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రిని బ్లాక్ ఫంగస్‌ నోడల్ కేంద్రంగా ప్రకటించింది. ఆస్పత్రిలో 225 పడకలు కేటాయించగా.. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో మ్యుకోర్ మైకోసిస్ కేసులకు చికిత్స అందిస్తున్నారు. అత్యవసరం మినహా సాధారణ వైద్య సేవలను నిలిపివేసి కేవలం బ్లాక్ ఫంగస్ బాధితులపైనే వైద్యులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఈఎన్టీ ఆసుపత్రిలో 135 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు ఉన్నారని వైద్యులు వెల్లడించారు. గడచిన 24 గంటల్లోనే సుమారు 90 మంది ఫంగస్ బాధితులు ఆస్పత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తోంది. వీళ్లలో ఇప్పటికే సుమారు పది మందికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు మిగతా వారికి అవసరమైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. మ్యుకోర్ మైకోసిస్ కేసులు పెరుగుతుండగా ఔషధాలను టీఎస్​- ఎన్​ఐడీసీ సమకూరుస్తోంది.

కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఇటీవల ఎక్కువగా బ్లాక్ ఫంగస్ సోకిందని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న వాళ్లే కాకుండా కొందరు హోంఐసోలాషన్‌లో ఉన్నవాళ్లూ బ్లాక్‌ ఫంగస్‌ బారినపడ్డారని చెప్పినట్లు తెలుస్తోంది. రోగనిరోధక శక్తి తగ్గడం వల్లే ఫంగస్ దాడి చేస్తుందని వైద్యులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చినట్టు సమాచారం. బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉండి కొవిడ్ పాజిటివ్‌ కేసులకు గాంధీలో చికిత్స అందిస్తున్నారు. గాంధీలో సుమారు 40 మంది వరకు బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరికి ఫంగస్ ప్రభావం మెదడుకి చేరడంతో వారికి ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నారు. కంటి సమస్యలతో వస్తున్న వారిని సరోజిని దేవి అసపత్రికి పంపిస్తున్నారు. మరికొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ బాధితులు ఉన్నారని సమాచారం.

కరోనా నుంచి కోలుకున్న వాళ్లని బ్లాక్ ఫంగస్ గుబులు పుట్టిస్తోంది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు వాడే యాంఫొటరిసిని-B ఇంజక్షన్‌ ధర ఒక్కో డోస్ బ్లాక్ మార్కెట్‌లో 30 నుంచి 70 వేల వరకు పలుకుతోంది. ప్రజలు అనవసరంగా బ్లాక్ ఫంగస్ చికిత్సకు లక్షలు ఖర్చు చేసుకోవద్దని ప్రభుత్వం కోరుతోంది. బాధితుల వివరాలను ent-mcrm@telangana.gov.in మెయిల్ చేస్తే అవసరమైన వారికి ప్రభుత్వ కమిటీ గుర్తించి మందులను అందిస్తుందని స్పష్టం చేస్తోంది.

ఇదీ చూడండి: ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోండిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.