రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన వరద ఆర్థిక సాయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని భారతీయ జనతా యువ మోర్చా హైదరాబాద్ నగర అధ్యక్షుడు వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆర్థిక సాయం పేరుతో తెరాస ప్రభుత్వం ఓట్ల రాజకీయం చేస్తోందని ఆరోపించారు. నగరంలో నిలిపేసిన వరద సాయాన్ని... బాధితులు అందరికి అందే వరకు కొనసాగించాలంటూ అబిడ్స్‌లోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.
స్థానిక తెరాస నాయకులు తమకు అనుకూలంగా ఉండే వారికే రూ.10 వేల సాయాన్ని అందించారని... అసలైన బాధితులకు అందించలేదని ఆరోపించారు. బాధితులందరికి న్యాయం జరిగే వరకు భాజపా తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.