రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సర్వేలు అన్ని భాజపావైపే మొగ్గుచూపాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి.. ఇష్టానుసారంగా డబ్బులు పంచారని ఆరోపించారు. అయినా తెరాసను ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. తెరాస నేతలు ఓట్లు అడగలేదని... కొనుగోలు చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కోట్లు ఖర్చు పెట్టినా వారికి కనీసం రెండో స్థానం కూడా దక్కడం లేదన్నారు.
తెరాస గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా భాజపా సహకరించింది. తెరాస ఎన్నికల్లో డబ్బులు పంచిందా.. లేదా..? పంచితే ఎన్ని కేసులు బుక్ చేశారు...? పోలీసులు సమాధానం చెప్పాలి. 4 గంటల లోపు క్యూలో ఉన్న ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఓటర్లకు భద్రత కల్పించాలి. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి. భైంసా ఘటనలో అరెస్ట్ చేసిన తమ కార్యకర్తలు సంతోష్, లింగోజి, ఇతరులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటల లోపు వారందరినీ బేషరతుగా విడిచిపెట్టాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మా ఆవేశాన్ని అడ్డుకుంటే అదే స్థాయిలో స్పందిస్తాం.
- బండి సంజయ్
ఇవీచూడండి: భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిపై దాడి..!