తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువు పీల్చుకోవడానికి నాడు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చేపట్టిన పోలీస్ యాక్షన్ ప్రధాన కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పటేల్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు నేతలతో కలిసి వల్లభ్‌భాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వాగ్దానాలు విస్మరించారని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పటేల్‌కు నివాళులర్పించి తమ నిజాయతీ చాటుకోవాలన్నారు. సూర్య చంద్రులున్నంత కాలం తెలంగాణ ప్రజలు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను మరువలేరని తెలిపారు.
పటేల్‌కు నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. మజ్లిస్ పార్టీ నేతల కనుసన్నల్లో తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతోందని అన్నారు. వల్లభ్‌భాయ్ పటేల్ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేశారు. రజాకార్ల, నిజాం నిరంకుశ పరిపాలనను అంతమొందించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అని పేర్కొన్నారు.
- ఇదీ చదవండి ఐక్యతా విగ్రహం వద్ద పటేల్‌కు మోదీ నివాళి