పీవీ సమాధి కూల్చేస్తామన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసమే కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద నివాళులర్పించిన బండి సంజయ్.. అయోధ్య విషయంలో పీవీ స్ఫూర్తిదాయక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా భాజపా చెప్పింది.. చేయాల్సిందే చేస్తోందని స్పష్టం చేశారు. పీవీ, ఎన్టీఆర్పై గౌరవముంటే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. నందమూరి తారక రామారావు పేరు పెట్టుకున్న కేటీఆర్.. డ్రామారావు అయ్యారని ఎద్దేవా చేశారు.
- ఇదీ చూడండి: దమ్ముంటే సమాధులు కూల్చండి: అక్బరుద్దీన్