ప్రజలు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కశ్మీర్ నిర్ణయంతో భాజపా పట్ల సానుకూల స్పందన కనిపిస్తోందని ఇష్టాగోష్ఠిలో వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8 లక్షల సభ్యత్వం దాటిందన్నారు. ఆగస్టు 11 లోపు నమోదు చేసుకున్న వారే క్రీయాశీలక సభ్యత్వానికి అర్హులని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
ప్రజాహితం కోసం తీసుకొనే నిర్ణయాలకు మద్దతు తెలపకపోతే చులకనవుతామని మాత్రమే తెరాస మద్దతిస్తోందన్నారు. తెలంగాణలో తెరాసనే తమ టార్గెట్ అన్న లక్ష్మణ్... మిగతా పార్టీలన్నీ చచ్చిన పాములేనన్నారు. సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విమోచన కార్యక్రమాలు చేపట్టి 17న నిర్వహించే బహిరంగ సభకు అమిత్‌షాను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. భాజపా అధికారంలోకి వచ్చాక సెప్టెంబరు 17న గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేస్తామన్నారు. రాజగోపాల్‌రెడ్డి చేరడం ఖాయమన్న ఆయన... పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు.
ఇదీ చూడండి: తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా నామినేషన్