ETV Bharat / city

కబ్జాదారులకు కేసీఆర్ కొమ్ముకాస్తున్నారు : బండి సంజయ్ - bandi sanjay fires on cm kcr

గిరిజనుల భూములు రక్షించేందుకు భాజపా ప్రయత్నిస్తుంటే.... కేసీఆర్ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. గుర్రంబోడు ఘటనపై స్పందించిన సంజయ్.. పోలీసులకు తమకు మధ్య ఎలాంటి గొడవ లేదని స్పష్టం చేశారు.

bjp state president bandi sanjay reaction on gurramboda tanda incident
గుర్రంబోడు ఘటనపై బండి సంజయ్ స్పందన
author img

By

Published : Feb 8, 2021, 12:41 PM IST

బడగు-బలహీన వర్గాల కోసం భాజపా పోరాడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఓబీసీ మోర్చా పదాధికారుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్‌... గుర్రంబోడు ఘటనపై స్పందించారు. సూర్యాపేట జిల్లా భాజపా అధ్యక్షుడితో సహా అనేక మందిని పోలీసులు కిడ్నాప్‌ చేశారని ఆరోపించారు. వారు ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు. వారికి ఏ హాని జరిగినా ఫాం హౌస్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

గిరిజన భూముల కోసం వెళ్తే... కబ్జాదారుల కోసం పోలీసులతో దాడి చేయించారని ఆరోపించారు. పోలీసులు న్యాయంగా వ్యవహరించాలని... తమవారిని వదిలిపెట్టాలని కోరారు. నాగార్జునసాగర్‌ ఎన్నికల్లో గిరిజనులు తెరాసకు బుద్ధిచెబుతారని వ్యాఖ్యానించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.