ETV Bharat / city

లక్ష్మణ్ బాపూజీ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం: బండి - కొండ లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి

స్వాతంత్య్ర సమరమోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని... బండి సంజయ్ అన్నారు. బాపూజీ 105వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.

bjp state president bandi sanjay pay tributes to konda laxman bapuji birth anniversary
లక్ష్మణ్ బాపూజీ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం: బండి
author img

By

Published : Sep 27, 2020, 5:43 PM IST

bjp state president bandi sanjay pay tributes to konda laxman bapuji birth anniversary
నివాళులు అర్పిస్తున్న సంజయ్

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ... మంత్రి పదవికి రాజీనామా చేసి తొలిదశ తెలంగాణ ఉద్యమంలో నిస్వార్థంగా పని చేశారని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. లక్ష్మణ్ బాపూజీ 105 వ జయంతి సందర్భంగా... దిల్లీలోని సంజయ్ నివాసంలో నివాళులు అర్పించారు. మలిదశ ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పాల్గొంటూ... యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.

ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా హాజరై... తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారని సంజయ్ గుర్తు చేసుకున్నారు. బలహీనవర్గాల నుంచి బలమైన నేతగా ఎదిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. స్వరాష్ట్రం సాధన కోసం అవిశ్రాంతంగా పోరాడిన మహనీయుడు బాపూజీ ఆశయాలకు అనుగుణంగా... ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ట్యాంక్ బండ్​పై ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్​... విస్మరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం స్ఫూర్తిదాయకం: కేసీఆర్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.