ETV Bharat / city

bandi sanjay: 'సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి' - హైదరాబాద్​ తాజా వార్తలు

సర్వాయి పాపన్న గౌడ్​ స్ఫూర్తితో గడీలు బద్దలు కొడతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​(bandi sanjay) అన్నారు. హైదరాబాద్​ నాంపల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్​ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

bandi sanjay
బండి సంజయ్​
author img

By

Published : Aug 18, 2021, 4:10 PM IST

హైదరాబాద్​ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్​ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​(bandi sanjay) పాల్గొన్నారు. సర్వాయి పాపన్నకు సంజయ్ నివాళులు అర్పించారు. ఆ పోరాటయోధుని స్ఫూర్తితో గడీలు బద్దలు కొడతామని అన్నారు. అవినీతి, దోపిడీ, కుటుంబ పాలనను అంతం చేద్దామని పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని బండి సంజయ్‌ డిమాండ్​ చేశారు.

సర్దార్​ సర్వాయి పాపన్న గౌడ్​ మనందరికీ స్ఫూర్తి ప్రదాత. నిజాం అరాచకాలను ఎదిరించిన సామాన్య వ్యక్తి సర్వాయిపాపన్న. శివాజీ హిందు సామ్రాజ్యం కోసం మొగల్​ చక్రవర్తులపై ఎలా పోరాటం చేశారో.. సర్వాయిపాపన్న కూడా అలానే పోరాటం చేశారు. రాష్ట్రంలో ఈ మహనీయునికి గుర్తింపు లేకుండా పోయింది. కనీసం పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంచేలా చేయాలి. కేసీఆర్​ సర్వాయి పాపన్న గౌడ్​కు నివాళులు కూడా అర్పించలేదు. ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇచ్చే హామీలను చూసి మోసపోవద్దు.

-బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

bandi sanjay: సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

ఇదీ చదవండి: Gandhi Hospital Rape Case: 'గాంధీ'లో అత్యాచారంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం

'గాంధీ'లో డీఎంఈ రమేశ్‌రెడ్డి విచారణ.. ఇప్పటికే అంతర్గత కమిటీ నివేదిక!

జీవోలన్నీ 24 గంటల్లో వెబ్​సైట్​లో పెట్టాలి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.