Bandi Sanjay on CM Kcr: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర రేపటి నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధమైంది. యాదాద్రి పుణ్య క్షేత్రం నుంచి భద్రకాళి ఆలయం వరకు 24 రోజుల పాటు యాత్ర సాగనుంది. విద్యార్థులు, వరద బాధితుల సమస్యలు పట్టించుకోకుండా... సీఎం కేసీఆర్ దిల్లీకి ఎందుకు వెళ్లారో స్పష్టత ఇవ్వాలని బండి సంజయ్ ధ్వజమెత్తారు. స్థానికుల సమస్యలు తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని వెల్లడించారు.
'రేపు ఉదయం 11 గంటలకు యాదాద్రిలో సభ నిర్వహించి ఆ తర్వాత నరసింహస్వామి సన్నిధి నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమవుతుంది. 5 జిల్లాలు, 12 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ యాత్ర 24 రోజులపాటు కొనసాగుతుంది. యాదాద్రి నరసింహస్వామి సన్నిధానం నుంచి భద్రకాళి అమ్మవారి వరకు ఈ యాత్ర సాగుతుంది. క్షేత్ర స్థాయిలో స్థానిక ప్రజల కష్టాల గురించి తెలుసుకోవడానికి.. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఈ యాత్ర ప్రారంభిస్తున్నాం. ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల మెనిపెస్టోని రూపొందిస్తాం.'-బండి సంజయ్, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు
ఇవీ చదవండి: