కామారెడ్డి జిల్లాలో అక్రమ ఇసుక క్వారీలపై రాష్ట్రప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియా చేతిలో గాయపడి సికింద్రాబాద్ సన్షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ్ కుమార్ను బండి సంజయ్ పరామర్శించారు.
విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిని ఇసుక మాఫియాకు చెందిన లారీ ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. పేద ప్రజల పట్ల ముఖ్యమంత్రికి గౌరవం ఉంటే వెంటనే ఈ ఘటన పట్ల స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే అతన్ని ఆదుకోవాలని అన్నారు.
అధికార పార్టీ నేతల అండతోనే...
జిల్లాలో అధికార పార్టీ నేతలు, పోలీసుల అండదండలతోనే ఇసుక మాఫియా కొనసాగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. ఇసుక క్వారీలపై విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే, లారీలను అడ్డగించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: దా'రుణ'యాప్‌ల కేసులో మరొకరు అరెస్ట్