తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. దేశ వ్యాప్తంగా అమలు చేస్తోన్నా, ఓటు బ్యాంకు ఆలోచనతో కేసీఆర్ తాత్సారం చేశారని దుయ్యబట్టారు. ఈ నెల 27న 24 గంటల దీక్ష చేయనున్న విషయం సీఎంకి తెలిసినందునే... ఈ నిర్ణయం తీసుకున్నారని... ఇది భాజపా విజయమన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనలు, కమిటీలతో కాపయాపన చేయకుండా అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెరాస ప్రభుత్వానికి భాజపా తడాఖా ఎందో చూపిస్తామని హెచ్చరించారు.
అయోధ్య రామాలయానికి నిధులు ఇవ్వొద్దంటున్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు... ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుపతికి వెళ్లి ఎందుకు విరాళం ఇచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. రాముడు భాజపా నేత కాదని... హిందువుల ఆరాధ్యదైవమనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే... డీజీపీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. అయోధ్యలో రామాలయం నిర్మాణంపై కేసీఆర్ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'రామమందిర విరాళాలపై ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్లు'