రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాగ్ బంగ్లాలో భాజపా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించుకున్నారు. తెలంగాణలో కొవిడ్ ను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి జిల్లాలోని ప్రతి మండలంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో ఓ మహిళ మృతి చెందిన ఐదు రోజులకు కరోనాతో మరణించినట్లు రిపోర్టు ఇచ్చారని... దీని బట్టి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి తెలుస్తోందని అన్నారు. కరోనా చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు.