BJP Deeksha in Hyderabad: హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద భాజపా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టింది. అసెంబ్లీ సమావేశాల నుంచి భాజపా నేతలు సస్పెన్షన్ సహా హైకోర్టు సూచనలను స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ భాజపా దీక్ష చేస్తోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడుగంటల వరకు దీక్ష చేసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇందిరా పార్కు వద్ద బారికేడ్లు సహా భారీగా పోలీసులను మోహరించి.. మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు.
దీక్షకు , హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా మాజీమంత్రి విజయ రామారావు, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యేలు బొడిగే శోభ, మాతినేని ధర్మారావు, యెండల లక్ష్మీనారాయణ, హాజరయ్యారు. దీక్షా స్థలికి భారీగా భాజపా శ్రేణులు తరలివచ్చారు.
ఇదీజరిగింది..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు... సభ నిర్వహణకు అడ్డుతగులుతున్నారంటూ భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్‌ను సభ నుంచి సస్పెండ్ చేశారు. స్పీకర్ నిర్ణయంపై భాజపా సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సింగిల్ జడ్జి సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే సింగిల్ జడ్జి ఉత్తర్వులుపై భాజపా సభ్యులు మరోసారి అప్పీలు చేశారు. దీనిపై మార్చి 14 విచారించిన హైకోర్టు.. దీనిపై స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షించింది. మార్చి 15న శాసన సభ స్పీకర్‌ను కలవాలని సూచించింది. భాజపా సభ్యులు స్పీకర్‌ను కలిపించాలని.. శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది. అయితే భాజపా నేతలను సభలోకి అనుమతించేందుకు సభాపతి నిరాకరించారు.
సంబంధిత కథనాలు: