హైదరాబాద్‌లో జులై 2,3 తేదీల్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక రోజు ముందుగానే ఇక్కడికి రానున్నారు. విమానాశ్రయంలో స్వాగతం పలికిన అనంతరం అక్కణ్నుంచి నోవాటెల్ వరకు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించాలని పార్టీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులతో శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్వహించారు. జులై 2న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ 4వ తేదీవ రాష్ట్ర రాజధానిలోనే ఉంటారని పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. 4న ఆయన హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తారని.. భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలలో పాల్గొంటారని సమాచారం.
రాష్ట్రంలో 119 శాసనసభ నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన భాజపా ముఖ్య నేతలు వెళ్లి బస చేసేలా పార్టీ ప్రణాళిక రూపొందించింది. 3న జరిగే మోదీ సభకు ఆయా నియోజకవర్గాల నుంచి ఎక్కువ జన సమీకరణ జరిగేలా చూడడం.. పార్టీ బలోపేతానికి తమ వంతు ప్రయత్నం చేయడం దీని ఉద్దేశం. ఇందులో కేంద్ర మంత్రులు, మాజీ సీఎంలు, జాతీయ పదాధికారులు, కార్యవర్గ సభ్యులు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు దళిత, గిరిజన నేతలే వెళ్లేలా జాబితా రూపొందించారు.
ఇదీ చూడండి: ఎస్ఎఫ్ఐ కార్యాలయంపై ఎన్ఎస్యూఐ కార్యకర్తల దాడి
సికింద్రాబాద్ కాల్పుల్లో మృతిచెందిన రాకేశ్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం