పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణను భాజపా ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్‌లు గోదావరి ఖనిలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవలే తెరాసకు రాజీనామా చేసిన సోమారపు సత్యనారాయణను భాజపాలో చేరాలని ఆహ్వానించారు. వారి వెంట కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
తెరాస సొంతవారినే ఓడిస్తోంది...
తెరాస రామగుండంలో సోమారపు సత్యనారాయణకు టిక్కెట్ ఇచ్చి ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు పలికిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సొంత పార్టీ వారినే ఓడించే స్థాయికి దిగజారిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన చుట్టూ ఉన్న వారికే పట్టం కడుతున్నారని ఆరోపించారు. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకే సముచిత స్థానం ఇవ్వకుండా అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. తనను భాజపాలోకి ఆహ్వానించడానికి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని తెరాస మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు.
ఇదీ చూడండి : శ్రీవారి సేవలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్