Bandi sanjay comments: వానాకాలం పంటకు సంబంధించి ప్రతి గింజను కొంటామని చెబుతున్నా ధాన్యం సేకరించకుండా తెరాస ప్రభుత్వం డ్రామాలు చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోలు అంశంపై లోక్‌సభలో తెరాస ఎంపీలు గొడవ చేస్తుండగా.. భాజపా ఎంపీ బండి సంజయ్ కుమార్ అడ్డుకున్నారు. వానా కాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనటం లేదన్న మనస్థాపంతో రైతులు వడ్ల కుప్పలపైనే పడి ప్రాణాలొదులుతున్నారని ఆరోపించారు. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. తెరాస ఎంపీలకు ధీటుగా బండి సంజయ్ నినాదాలు చేస్తూ ఆ పార్టీ సభ్యుల తీరును ఎండగట్టారు. బండి సంజయ్‌తో పాటు భాజపా ఎంపీ సోయం బాపూరావు కూడా సభలో తెరాస ఎంపీల నినాదాలకు ప్రతి నినాదాలు చేశారు.
Bandi sanjay on paddy procurement: "ఎందుకీ డ్రామాలు? యాసంగి పంట కొనబోమని ఎవరు చెప్పారు? రా రైస్ పక్కా కొంటాం. ఇదే మాట కేంద్రం చెబుతున్నా డ్రామాలెందుకు? వానా కాలం పంట ఎందుకు కొనడం లేదని అడుగుతుంటే యాసంగి పేరుతో ఈ డ్రామాలేంది? కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో ధాన్యం వానకు తడుస్తూ మొలకలెత్తున్నా ఎందుకు కొనడం లేదు. వరి కుప్పలపై రైతులు ప్రాణాలొదులుతున్నా కనిపించటం లేదా? ఇంకెంత మంది రైతులను తెరాస ప్రభుత్వం చంపుతుంది..? వానా కాలం పంటకు సంబంధించి ప్రతి గింజను కొంటామని కేంద్ర మంత్రి చెబుతున్నా రైతుల నుంచి ఎందుకు సేకరించడం లేదు? యాసంగిలోనూ రా రైస్ కొంటామని కేంద్రం ప్రకటించినా ఇంకా ఈ రాజకీయం చేయడమేంది? సమస్యను పక్కదారి పట్టించేందుకే తెరాస ఎంపీలు ఈ డ్రామా చేస్తున్నారు." - బండి సంజయ, ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
Bandi snajay on TRS MPs protest: నిన్న(బుధవారం) పార్లమెంట్ సెంట్రల్ హాల్లోని క్యాంటిన్ వద్ద తెరాస ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపిన ఫొటోలు పార్లమెంట్లో నిరసన తెలుపుతున్నట్లుగా మీడియాలో ప్రచురితం చేయటం పట్ల బండి సంజయ్ విస్మయం వ్యక్తం చేశారు. సెంట్రల్ హాల్ క్యాంటిన్లో ఫొటోలు దిగి సభలో నిరసన తెలిపినట్లు మీడియాకు ఫోజులివ్వడమేంటని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి: