mla Rajasingh fires on trs protests: భాజపా శాసనసభాపక్ష నేత రాజాసింగ్... తెరాస, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని రాజాసింగ్ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటున్న తరుణంలో ఆ చర్చను పక్కదారి పట్టించేందుకే నిరసనల పేరుతో తెరాస నాటకాలాడుతోందని విమర్శించారు. ఈ మేరకు ఆయనొక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్, తెరాస నాయకులు దొందూ దొందేనన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళిత బంధు సహా నిరుద్యోగులు, ఉద్యగుల సమస్యలపై భాజపా చేస్తున్న పోరాటాలపై ప్రజల్లో చర్చ జరుగుతుంటే.. ఓర్వలేక నిరసనల పేరుతో డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని తిడుతూ ప్రజా ప్రతినిధులను కలవకుండా ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే అర్హతలేదన్నారు.
ఎంపీ అర్వింద్ రాజీనామా చేయాలంటూ..
పసుపుబోర్డు తెస్తానని హామీ ఇచ్చి విఫలమైన ఎంపీ అర్వింద్ రాజీనామా చేయాలని నిజామాబాద్‌లో పలువురు రైతులు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు ఎంపీ అర్వింద్ బోర్డు కోసం ఉద్యమించాలని నినాదాలు చేశారు. ఈ ఏడాది అధిక వర్షాలతో దిగుబడి తగ్గడంతో కొంతమేరకైనా ధర అధికంగా వస్తోంది అనుకుంటే క్వింటాల్ కు 5000 రూపాయల లోపే వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ అర్వింద్ విదేశాలకు ఎగుమతులు చేసి పసుపుకు మంచి ధర వచ్చేలా చేస్తున్నాని చెప్పుకోవడం సరికాదని విమర్శించారు.
ఇదీ చూడండి: ప్రధాని వ్యాఖ్యలపై తెరాస నిరసనల హోరు.. భగ్గుమన్న గులాబీదళం