ETV Bharat / city

లింగోజిగూడలో టెన్షన్​.. పోలీసుల వైఖరిపై భాజపా నేతల ఆందోళన - tension in lingojiguda

హైదరాబాద్​ లింగోజిగూడ డివిజన్​లోని గ్రీన్​పార్క్​ కాలనీలో భాజపా కార్యకర్తలు ఆందోళన చేశారు. ఉపఎన్నికల వేళ డబ్బులు పంచుతున్న వ్యక్తిని పోలీసులకు అప్పగిస్తే... కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి దర్జాగా వచ్చి తీసుకెళ్లటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

bjp leaders protest in lingojiguda
bjp leaders protest in lingojiguda
author img

By

Published : Apr 29, 2021, 3:34 PM IST

హైదరాబాద్ లింగోజిగూడ డివిజన్ గ్రీన్​పార్క్ కాలనీలో గందరగోళం నెలకొంది. 30న జరగనున్న ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి బంధువు కాలనీలోని ఓ ఇంట్లో డబ్బులు పంపిణీ చేస్తుండగా... భాజపా నేతలు పట్టుకున్నారు. సదరు వ్యక్తిని ఎన్నికల అధికారులకు, పోలీసులకు అప్పగించారు.

అనంతరం దర్పల్లి రాజశేఖర్ రెడ్డి వచ్చి పోలీసు వాహనం నుంచి ఆ వ్యక్తిని దింపి తీసుకువెళ్లారంటూ భాజపా నేతలు ఆరోపించారు. ఈ ఘటన పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని అధికారులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. ఈ క్రమంలో కాలనీలో కొంత గందరగోళం నెలకొంది.

ఇదీ చూడండి: ఒకే గదిలో వందకు పైగా కరోనా రోగులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.