ETV Bharat / city

AP: వైకాపా ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు: భాజపా - తెలంగాణ వార్తలు

ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను భాజపా నేతలు తీవ్రంగా ఖండించారు. వైకాపా ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని భాజపా ఏపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్​ఛార్జీ సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు.. భయంతో చేసినవేనని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

bjp-leaders-fire-on-minister-perni-nani-comments

author img

By

Published : Aug 7, 2021, 5:41 PM IST

bjp fires on ycp leaders, ap bjp leaders fires on cm jagan
ఏపీ మంత్రి పేర్ని నానిపై భాజపా నేతల ఆగ్రహం, ఏపీ ప్రభుత్వంపై భాజపా నేతలు ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లో కాషాయ ముఖ్యమంత్రి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను భాజపా నేతలు తీవ్రంగా ఖండించారు. వైకాపా ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్​ఛార్జ్​ సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. ఆ ఆలోచన కూడా తమ పార్టీకి లేదని తేల్చి చెప్పారు. ఏ క్షణంలో బెయిల్ రద్దు అవుతుందో తెలియక, రోజు గడవడానికి అప్పుపుట్టక.. ఏపీ ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టారని ఎద్దేవా చేశారు. దీనికితోడు వేలకోట్ల అవినీతి చేసి వైకాపా ప్రభుత్వానికి వారే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి తవ్వుకున్నారని పేర్ని నాని వ్యాఖ్యలపై ఘాటుగా ట్వీట్ చేశారు.

భయంతోనే..

ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు భయంతో చేసినవేనని భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధి కోసమే కమలం పార్టీ పని చేస్తోందని స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన ఆరోగ్య స్వయం సేవక్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మూడో దశ కొవిడ్​ను ఎదుర్కొనేందుకు వీలుగా ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. తమది కుటుంబపాలన పార్టీ కాదన్న సోము వీర్రాజు.. రాజకీయాల్లో సమాజసేవే ప్రథమ లక్ష్యంగా భాజపా పని చేస్తుందన్నారు.

మరోవైపు ఏపీలో జనహితం కోసం తమ పార్టీ పని చేస్తుంటే.. కుటుంబ పార్టీలైన వైకాపా, తెదేపాలు రాజకీయాల కోసం ప్రయత్నిస్తున్నాయని భాజపా విజయవాడ సిటీ అధ్యక్షుడు రవి వ్యాఖ్యానించారు. ఏపీలో రూ.2లక్షల కోట్లతో నిర్మిస్తున్న జాతీయ రహదారుల ప్రాజెక్టులు కేంద్ర నిధులు కాదా అంటూ ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఏపీ పాలకులు ఇక్కడోమాట, దిల్లీలో మరోమాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.

ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేసిన సోము వీర్రాజు...

చేనేత దినోత్సవాన్ని పురష్కరించుకొని విజయవాడలోని చేనేత భవన్​లో సోము వీర్రాజు ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేశారు. ప్రధాని మోదీ పిలుపుతో ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. చేనేత రంగానికి చేయూతనిచ్చే విధంగా మోదీ ఈ కార్యక్రమాన్ని తెచ్చారని గుర్తు చేశారు. లోకల్ ఫర్ లోకల్ నినాదంతో ప్రధాని మోదీ.. స్థానిక వస్తువులు, కళలను ప్రోత్సహిస్తున్నారని భాజపా అఖిల భారత ప్రధాన కార్యదర్శి రవి పేర్కొన్నారు. ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేస్తే చేనేత రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు.

ఇదీ చదవండి: CM KCR REVIEW: నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.