జీహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ మందకొడిగా సాగుతోందని... ప్రభుత్వం సరైన కొవిడ్ చర్యలు చేపట్టకపోవడం ఒక కారణమని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి దీక్ష చేపట్టారు. ఈ ఎన్నికలు భాగ్యనగరం భవిష్యత్తును నిర్ధారించేవని... ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకొని పోలింగ్ శాతాన్ని పెంచాలని లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకునేందుకు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ... ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం కేసీఆర్ కుట్రేనని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఐదేళ్లు బాధపడే బదులు ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకనునేందుకు ఒక్క రోజు బయటకు రావాలని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: గ్రేటర్ పోరు: నగరవాసుల బాధ్యతకు బద్ధకపు ముసుగు...!