ETV Bharat / city

పోతిరెడ్డిపాడును అడ్డుకోకపోతే కేసీఆర్​ ద్రోహిగా మిగిలిపాతాడు: వివేక్ - కేసీఆర్​పై మండిపడ్డ మాజీ ఎంపీ వివేక్

ముఖ్యమంత్రి కేసీఆర్​పై... భాజపా నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తీవ్ర వాఖ్యలు చేశారు. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు అడ్డుకోకపోతే... కేసీఆర్​ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతాడని ఆక్షేపించారు.

bjp leader vivek venklata swamy fire on cm kcr about pothireddypadu
అడ్డుకోకపోతే కేసీఆర్​ ద్రోహిగా మిగిలిపాతాడు: వివేక్
author img

By

Published : Aug 5, 2020, 10:26 PM IST

పోతిరెడ్డిపాడు వ్యవహారంలో కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి డైరెక్షన్ మేరకే సీఎం కేసీఆర్ నడుచుకుంటున్నారని భాజపా నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. విస్తరణ పనులు అడ్డుకునేందుకు అపెక్స్‌ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసేందుకు... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కేంద్రంతో మాట్లాడుతుంటే... కేసీఆర్ మాత్రం ఫామ్‌ హౌస్‌లో కూర్చొని సెక్రటేరియట్​ని ఎలా కూల్చాలి, కొత్త డిజైన్‌లతో కమిషన్ ఎలా రాబట్టుకోవాలని ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలు ఆపకపోతే కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతాడని ఆక్షేపించారు. ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వెళ్లైనా పోతిరెడ్డి పాడు, సంగమేశ్వర ప్రాజెక్టు విస్తరణ పనులను అడ్డుకోవాలని అయన డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.