రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రతలేదని భాజపా నేత, మాజీ ఎంపీ విజయశాంతి మండిపడ్డారు. మహిళలు, యువతులు, చిన్నారులు బయట తిరిగే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణికాలనీలో దారుణమైన ఘటన జరిగినా.. ముఖ్యమంత్రి రాకపోవడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే హక్కులేదని తెలిపారు.
సింగరేణి కాలనీకి వచ్చిన విజయశాంతి చిన్నారి కుటుంబసభ్యులను పరామర్శించారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. తోడుంటామని భరోసానిచ్చారు. ఉదయం ఆరు గంటలకు వచ్చి... డబ్బులు ఇచ్చి... బాధితుల నోరు మూసేద్దామనుకోవడం సమంజసం కాదని విజయశాంతి అధికారపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలపై ఉద్యమం చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు.
"రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి కల్చర్ పెరిగిపోయింది. తెలంగాణ స్థాయి దిగజారిపోతోంది. ఆడబిడ్డలకు రక్షణ పోతోంది. ఆడపిల్లల తల్లిదండ్రులు భయాందోళనలో ఉన్నారు. వృద్ధులు, మహిళలు, యువతులు, చిన్నారులపై వావీవరస లేకుండా తెగబడిపోతున్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా.. బాధితులను ఓదార్చేందుకు సీఎం రారా. ఇవేవీ ఆయనకు పట్టవా." - విజయశాంతి, మాజీ ఎంపీ
ఇదీ చూడండి: