ETV Bharat / city

VIJAYASHANTHI: 'హుజూరాబాద్​లో భాజపా గెలుపు ఖాయం... అందుకే కేసీఆర్​కు భయం'

కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రజలకు చేరనివ్వకుండా తెరాస ప్రభుత్వం అడ్డుకుంటోందని భాజపా సీనియర్​ నేత విజయశాంతి విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ భాజపానే అని ఆమె స్పష్టం చేశారు. బండి సంజయ్ ఈ నెల 28 నుంచి చేపట్టనున్న యాత్రకు సంబంధించి పాటలను, పుస్తకాన్ని హైదరాబాద్​లోని రాష్ట్ర కార్యాలయంలో ఆమె విడుదల చేశారు.

VIJAYASHANTHI: 'తెలంగాణ అభివృద్ధిని సీఎం కేసీఆరే అడ్డుకుంటున్నారు'

author img

By

Published : Aug 25, 2021, 3:36 PM IST

రాష్ట్ర ఏర్పాటు అనంతరం అవినీతి పాలన, దోపిడీని తెలియజేస్తూ ప్రజా సంగ్రామ యాత్ర సాగుతుందని భాజపా నాయకురాలు విజయశాంతి తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 28 నుంచి చేపట్టనున్న యాత్రకు సంబంధించి పాటలను, పుస్తకాన్ని హైదరాబాద్​లోని రాష్ట్ర కార్యాలయంలో ఆమె విడుదల చేశారు. కాంగ్రెస్, తెరాసలు దోపిడీ పార్టీలుగా అభివర్ణించిన ఆమె... 2023లో భాజపా అధికారంలోకి వస్తుందని, మంచి పాలనను అందిస్తుందని అన్నారు. బంధుల పేరుతో పథకాలు ప్రవేశపెడుతున్న కేసీఆర్.. అన్ని బంద్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ లో భాజపా గెలుస్తుందని... అందుకే కేసీఆర్​కు ఓటమి భయం పట్టుకుందన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రజలకు చేరనివ్వకుండా తెరాస ప్రభుత్వం అడ్డుకుంటోందని విజయశాంతి విమర్శించారు. తద్వారా తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆరే అడ్డుపడ్డుతున్నారని ఆరోపించారు. ఏడేళ్ల పాలనలో తెరాస పాలన అవినీతిని పాటల ద్వారా ఎండగట్టామని తెలిపారు. భాజపాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ భాజపానే అని విజయశాంతి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రత్యామ్నాయం భాజపానే అవుతుంది. కాంగ్రెస్​, తెరాసలు దోపిడీ పార్టీలు. ఇవాళ కేంద్రం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ఇక్కడ ప్రజల్లోకి వెళ్లడం లేదు. ఎందుకంటే కేసీఆర్​, తెరాస ప్రభుత్వం అడ్డుకుంటోంది. నా రాష్ట్రం.. నా ఇష్టం అన్నట్లు కేసీఆర్​ ప్రవర్తిస్తున్నారు. ఆయన అరాచకం వల్ల ఏదీ మంచి చేయలేకపోతున్నాం. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన మనిషిగా, ఉద్యమకారిణిగా బాధగా అనిపిస్తోంది. మేం అనుకున్న తెలంగాణ రాలేదు. ఈ ఉప ఎన్నికలో కూడా భాజపానే గెలుస్తుంది. ఎలాంటి అనుమానం లేదు. పాపం కేసీఆర్​కు మైండ్​ బ్లాక్​ అయినట్లుంది. ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. అన్ని బంధులు ఇస్తామంటూ అంటున్నరు. -విజయశాంతి, మాజీ ఎంపీ, భాజపా సీనియర్​ నాయకురాలు

VIJAYASHANTHI: 'తెలంగాణ అభివృద్ధిని సీఎం కేసీఆరే అడ్డుకుంటున్నారు'

ఇదీ చదవండి: Gangula: మంత్రి గంగులకు నకిలీ ఈడీ నోటీసులు... పంపిందెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.