Raghunandhan Rao Comments: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విరుచుకుపడ్డారు. చైనా జీడీపీ పెరిగి భారత్‌ది పడిపోయిందని కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చైనాలో మిలిటరీ రూల్ ఉన్నదనే విషయాన్ని మంత్రి తెలుసుకోవాలన్నారు. చైనా మిలిటరీ ప్రభుత్వం వేల మంది ముస్లీంను ఊచకోత కోస్తోందని ఆరోపించారు. చైనా తరహా పాలన కావాలని అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. కేంద్రాన్ని విమర్శించేందుకే తెరాస నేతలు ప్రెస్‌మీట్లు పెడుతున్నారని ఆక్షేపించారు. రైతులకు ఉచితంగా ఇస్తామన్న ఎరువులు ఎక్కడికి పోయాయో చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగబోతున్నాయని.. రెండు రోజుల్లో సమావేశాల వేదిక ఇతర వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.
"చైనా గురించి పదే పదే కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారు. భారత్‌లో కూడా చైనా తరహా మిలిటరీ రూల్ కోరుకుంటున్నారా..? చైనా జీడీపీ పెరిగింది... భారత్ ది పడిపోయిందంటూ కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మన దేశంలో కూడా మిలిటరీ రూల్ అమలు చేస్తే భారత ఆర్థిక వ్యవస్థ కూడా చైనాను మించి పోతుంది. చైనా తరహా పాలన కావాలని అసెంబ్లీలో చర్చ పెట్టండి. చైనాలాగే జీవితకాలం కేసీఆర్ కుటుంబమే అధికారంలోకి ఉండాలని కోరుకుంటుంది. కుటుంబ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేడ్కర్ రాజ్యాంగం అమలు చేసేందుకే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం." - రఘునందన్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే
ఇవీ చూడండి: