ETV Bharat / city

'మజ్లిస్​ చెప్పుచేతల్లోనే సీఎం కేసీఆర్​ పాలన' - bjp leader nvss prabhakar fire on mim leaders

ఎంఐఎం- తెరాసలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యహరిస్తున్నారని భాజపా ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఎంఐఎం ఎమ్మెల్యేపై పెట్టిన కేసులను నిరుగార్చే విధంగా తెరాస ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు.

'మజ్లీస్​ చెప్పుచేతల్లోనే సీఎం కేసీఆర్​ పాలన'

author img

By

Published : Nov 13, 2020, 3:04 PM IST

మజ్లిస్ చెప్పుచేతల్లోనే సీఎం కేసీఆర్​ పనిచేస్తున్నారని భాజపా ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హైదరాబాద్​లో ఆరోపించారు. కేసీఆర్​తో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన తరువాతనే జీహెచ్ఎంసీ ఎన్నికల కార్యాచరణ మొదలు పెట్టారని తెలిపారు. పాలనాపరమైన నిర్ణయాలు దారుసలేంలో ఉన్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఎంఐఎంకు కావల్సిన విధంగా తెరాస సహకరిస్తుందని స్పష్టమవుతోందని పేర్కొన్నారు.

ఎంఐఎం- తెరాసలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యహరిస్తున్నారని ఆక్షేపించారు. ఎంఐఎం ఎమ్మెల్యేపై పెట్టిన కేసులను నిరుగార్చే విధంగా తెరాస ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. ఛార్జ్​షీట్స్ వేయకుండా... సాక్షులను ప్రవేశ పెట్టకుండా... ప్రభుత్వమే కేసును నిరుగారుస్తుందని ప్రభాకర్​ దుయ్యబట్టారు.

ఇదీ చూడండి: టపాసుల నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.