బీసీల పట్ల వివక్షత చూపుతున్న తెరాస ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయాలని భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించిన ముషీరాబాద్ నియోజకవర్గం కార్పొరేటర్లను హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాలులో ఆయన సన్మానించారు.
కమలం పార్టీ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని లక్ష్మణ్ అన్నారు. తెరాస సర్కారు బీసీ జాబితాలోకి మైనార్టీలను చేర్చి బీసీల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. బీసీలు నిర్మాణాత్మక పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: అవినీతిపై విచారణకు నేను సిద్ధం.. మరి మీరు: మంత్రి పువ్వాడ