ఏపీలో మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించటాన్ని భాజపా సీనియర్ నేత కన్నా లక్ష్మీనాారాయణ (Kanna on repeal three capital bill) స్వాగతించారు. మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ నిర్ణయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలపై కన్నా మండిపడ్డారు. ఇది ఇంటర్వెల్ అని మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతున్నారని.. అలా మాట్లాడితే ప్రజలు మీకు శుభం కార్డు వేస్తారని హెచ్చరించారు. మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన అవగాహనారాహిత్యం, అహంకారంతో తీసుకున్న నిర్ణయమన్నారు. దాన్ని తాము మెుదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నామని తెలిపారు. అమరావతి రైతుల పాదయాత్రలో భాజపా నేతలంతా పాల్గొనటం కూడా ఈ నిర్ణయానికి కారణం కావొచ్చని కన్నా అభిప్రాయపడ్డారు.
పెద్దిరెడ్డి ఏమన్నారంటే..
ఏపీ మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి(peddireddy on ap three capitals law withdraw) మాట్లాడుతూ..ఇది ఇంటర్వెల్ మాత్రమేనని శుభం కార్డుకు మరింత సమయం ఉందన్నారు. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని.. చట్టం ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదన్నారు.
మూడు రాజధానులపై ఉదయం నుంచి కీలక పరిణామాలు
మూడు రాజధానుల విషయం(ap Three Capitals Act)పై ఉదయం నుంచి హడావుడి కనిపించింది. మూడు రాజధానుల చట్టాన్ని (ap govt withdrew Three Capitals Act) వెనక్కి తీసుకుంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి పాలన వికేంద్రీకరణ చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబధించిన మూడు రాజధానుల చట్టం రద్దు బిల్లును కేబినెట్లో ఆమోదించారు. ఇదే విషయాన్ని.. అమరావతి కేసుల్లో జరుగుతున్న రోజువారీ విచారణలో భాగంగా హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తెలియజేశారు.
ఇదీ చదవండి :
- AP High Court on three capitals cases: '3 రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించండి'
- Amaravati capital news: 'వికేంద్రీకరణే మా ప్రభుత్వ ఉద్దేశం, త్వరలో కొత్త బిల్లుతో వస్తాం..'
- three capitals withdrawn : మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం
- Amaravati JAC letter to PM: ప్రధాని మోదీకి అమరావతి ఐకాస లేఖ..