మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు గొప్పతనం భావితరాలకు తెలపాలనే ఉద్ధేశంతోనే కేంద్రం ఆయన పేరిట స్టాంపును విడుదల చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పీవీ ఆలోచనలను పాటించే విధంగా భాజపా ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. పీవీ 16వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ పీవీఘాట్‌లోని ఆయన సమాధికి పుష్పాంజలి ఘటించారు.
పీవీ నర్సింహారావు... తాను ప్రాతినిధ్యం వహించే కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కావడం తనకెంతో గర్వంగా ఉందని బండి సంజయ్ తెలిపారు. దేశానికే స్ఫూర్తినిచ్చిన పీవీకి నివాళులర్పించడానికి సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదని సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు పీవీ శతజయంతి ఉత్సవాల పేరుతో జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ మంత్రి విజయరామారావు తదితర భాజపా నేతలున్నారు.