ETV Bharat / city

Etela Rajender: 'ఉద్యమకారులను రాళ్లతో కొట్టిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారు' - etela rajender comments

భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్​ (Etela Rajender) మరోసారి సీఎం కేసీఆర్​పై (CM KCR) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హుజూరాబాద్​ ఉపఎన్నిక కోసమే పథకాలు తెస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్ రాకముందే హామీలు నెరవేర్చాలని డిమాండ్​ చేశారు.

Etela Rajender
హుజూరాబాద్ ఉపఎన్నికల కోసమే పథకాలు
author img

By

Published : Aug 5, 2021, 11:50 AM IST

Updated : Aug 5, 2021, 12:05 PM IST

హుజూరాబాద్‌లో గెలుపు కోసం కేసీఆర్‌ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా.. నియోజకవర్గ ప్రజలు తనవైపే ఉంటారని భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ (Etela Rajender) ధీమా వ్యక్తం చేశారు. పాదయాత్రలో స్వల్ప అస్వస్థతతో అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మెరుగైన వైద్యం అందించిన ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తెరాసలో తెలంగాణ ఉద్యమకారులు కనుమరుగయ్యారని పేర్కొన్నారు. ఉద్యమ ద్రోహులంతా తెరపైకి వచ్చారని మండిపడ్డారు. మానుకోటలో ఉద్యమకారులపై రాళ్లువేసిన వ్యక్తికి ప్రాధాన్యమిచ్చారని విరుచుకుపడ్డారు. ఉద్యమకారులను రాళ్లతో కొట్టిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారని (MLC) ధ్వజమెత్తారు. తనతో కలిసి పనిచేసిన ఉద్యమకారులు ఇకనైనా ఈ అంశంపై ఆలోచించాలని సూచించారు.

కేసీఆర్ డబ్బుని నమ్ముకుని నేతలను కొనుగోలు చేస్తున్నారని ఈటల ఆరోపించారు. హుజూరాబాద్‌లో (Huzurabad) ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు చేశారన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికతో (Huzurabad by election) కేసీఆర్‌కు(CM KCR) హామీలు గుర్తొచ్చాయని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతిని తక్షణమే అమలుచేయాలని డిమాండ్​ చేశారు. ఏడేళ్లలో ఎప్పుడైనా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారా? అని ప్రశ్నించారు.

దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఉపముఖ్యమంత్రిని తీసేశారు. దళిత కుటుంబాలకు రూ.10 లక్షల సాయాన్ని స్వాగతిస్తున్నా... రాష్ట్రంలోని దళితులందరికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను సైతం ఆదుకోవాలి.

-ఈటల రాజేందర్, మాజీ మంత్రి, భాజపా నేత

హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే కేసీఆర్ తాయిలాలు చేస్తున్నారని ఈటల రాజేందర్​ స్పష్టం చేశారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్ రాకముందే హామీలు నెరవేర్చాలని అన్నారు. రెండు, మూడ్రోజుల తర్వాత పాదయాత్ర పునఃప్రారంభిస్తానని వెల్లడించారు.

అసలు ఆసుపత్రిలో ఎందుకు చేరారంటే..

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ నియోజకవర్గంలో 'ప్రజా దీవెన' యాత్రలో అస్వస్థతకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్​ హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేరారు. మోకాలి నొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరారు. పాదయాత్రలో భాగంగా కరీంనగర్​ జిల్లా వీణవంక మండలం కొండపాక గ్రామానికి చేరుకోగానే ఈటల అస్వస్థతకు గురయ్యారు. అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన ఈరోజు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

కేసీఆర్​పై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్​

ఇవీ చూడండి:

Last Updated : Aug 5, 2021, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.