ETV Bharat / city

ఉప ఎన్నికలు ఒక భాగం మాత్రమే: బీఎల్.సంతోష్ - భాజపా జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ వార్తలు

ఉపఎన్నిక ఒక భాగం మాత్రమేనని భాజపా జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్.సంతోష్ అన్నారు. ఎన్నేళ్ల నుంచి ఉన్నామనేది ముఖ్యంకాదని.. పార్టీ కోసం ఏమీ చేశావన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారులతో సమావేశమయ్యారు.

Bjp General Secretary Santhosh Directions to office Bearers
బీఎల్.సంతోష్
author img

By

Published : Jul 31, 2021, 4:51 PM IST

హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారులతో భాజపా జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్ సమావేశమయ్యారు. ఎన్నేళ్ల నుంచి ఉన్నామనేది ముఖ్యంకాదని.. పార్టీ కోసం ఏమీ చేశావన్నదే ముఖ్యమని సంతోష్​ స్పష్టం చేశారు. పార్టీ నిర్మాణం, ఓట్లు సాధన, వనరుల సమీకరణ దీంట్లో ఏదీ చేయలేని వారికి పార్టీ పదవులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఎదో ఒక సబ్జెక్టులో నిష్ణాతులు కావాలని సూచించారు. కష్టపడి పని చేస్తేనే పదవులు దక్కుతాయని చెప్పారు.

జిల్లాల్లో పర్యటించాలి

పదాధికారుల నుంచి పార్టీ పరిస్థితి అడిగి తెలుసుకున్న సంతోష్.. ప్రతి ఆఫీస్ బేరర్ అన్ని జిల్లాల్లో పర్యటించాలన్నారు. వాక్సిన్ కేంద్రాలు, రేషన్ దుకాణాలను సందర్శించాలని ఆదేశించారు. పోలింగ్ బూతులు పటిష్టంపై దృష్టి సారించాలన్నారు. సంస్థాగతంగా బలంగా లేక పోవడంతోనే బెంగాల్​లో గెలవలేక పోయామన్నారు. మన్ కి బాత్​ను అందరూ నేతలు వినడంతో పాటు ప్రతి పోలింగ్ బూత్​లో మన్ కి బాత్ కార్యక్రమం వినేల ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ముందుగా ఒక 5 వేల బూతుల్లో ప్రతి నెల మన్​కి బాత్​లో కనీసం 10 మంది పాల్గొనేలా చూడాలని చెప్పారు.

బూత్ స్థాయి వరకు వాట్సాప్ గ్రూప్స్

రాష్ట్ర అధ్యక్షుడు నుంచి మండల ప్రధాన కార్యదర్శి వరకు మన్ కి బాత్​లో ఎదో ఒక బూత్​లో పాల్గొనాలని ఆదేశించారు. స్థానికులతో మన్ కి బాత్ అంశాలపై చర్చించాలని.. ఎన్నికల వరకు 30 వేల బూతుల్లో ఈ కార్యక్రమం జరగాలన్నారు. మీడియా సహకరించకున్న సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు. క్రియశిలకంగా ఉండడంతో పాటు బూత్ స్థాయి వరకు వాట్సాప్ గ్రూప్స్ తయారు చేయాలని కోరారు. కలవండి, సమష్టిగా చర్చించండి నిర్ణయాలు తీడుకోండి.. ఫలితాలు సాధించండంటూ దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి: Bandi sanjay: 'మహనీయుల బలిదానాలు వృథా కానివ్వబోం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.