ETV Bharat / city

BJP in Telangana: దూకుడు పెంచిన కమలదళం.. తెలంగాణలో అధికారమే లక్ష్యం.. - trs leaders joining in bjp

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భాజపా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఒక వైపు ఆపరేషన్‌ ఆకర్ష్.. మరోవైపు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధనాలపై పోరాటం.. ఇలా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. రాష్ట్రంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించిన జాతీయ నాయకత్వం.. చేరికల విషయంలో జాగ్రత్తగా వ్యవహారించాలని భావిస్తోంది. బంగాల్‌ తరహాలో బోల్తా పడకుండా ఉండేందుకు ముందస్తు కార్యాచరణ రూపొందిస్తోంది. 2023 ఎన్నికల్లో అధికారం తమదేనంటున్న కాషాయదళం.. అధికార తెరాసను ఎలా ఎదుర్కొనుందని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

BJP Focus on telangana to win in 2023 election

author img

By

Published : Jan 12, 2022, 8:21 PM IST

తెరాసకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు భాజపా దూకుడు పెంచింది. తెరాస సర్కార్‌ వైఫల్యాలను నిత్యం ప్రజా క్షేత్రంలో ఎండగడుతోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులను సమీకరించుకునే పనిలో పడింది. ఇతర పార్టీల నుంచి ప్రజా, ఆర్థిక బలం ఉన్న నేతలను భాజపాలో చేర్చుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇత‌ర పార్టీల నుంచి భాజపాలో చేరేందుకు ఎమ్మెల్యేలు సైతం టచ్‌లో ఉన్నారంటూ రాష్ట్ర నాయకత్వం బహిరంగంగా ప్రకటించింది. ఈ చేరికలపై ఎప్పటి నుంచి దృష్టి పెడతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. సంక్రాంతి తరువాత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలను చేర్చుకోవాలని భావించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో చేరికల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

ఏ ఉద్దేశంతో వస్తున్నారో తెలుకున్నాకే..

భాజపాలోకి చేరిక‌లు మొద‌లైతే పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ పార్టీ పటిష్ఠం అవ్వడానికి అంత కష్టమేమీ కాదన్న భావనలో కాషాయదళం ఉంది. పార్టీ చేప‌డుతున్న కార్యక్రమాల‌తో రాష్ట్రవ్యాప్తంగా ప్రజ‌లు భాజపాను ప్రత్యామ్నాయ పార్టీగా చూస్తున్నార‌ని.. స‌మ‌యం వ‌స్తే పార్టీకి అండ‌గా ఉంటార‌న్న ధీమా వ్యక్తం చేస్తున్నారు క‌మ‌లనాథులు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని మ‌రింత బలోపేతం చేసి ప్రజ‌ల‌కు చేరువ చేయాల‌ని యోచిస్తోంది. ఏ పార్టీ నుంచి ఎవ‌రు వ‌స్తున్నారు.. ఏ ఉద్దేశంతో వారు భాజపాలో చేరుతున్నార‌న్న దానిపై పూర్తిగా సమాచారం సేకరించిన తరువాతే నేత‌ల‌ను పార్టీలో చేర్చుకోవాల‌ని నిర్ణయించిన‌ట్టు తెలుస్తోంది. ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా నేత‌ల‌ను పార్టీలో చేర్చుకుంటే ఎన్నికల సమయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచి ఉందని భాజపా ఆలోచిస్తోంది.

బంగాల్​ పరిస్థితి రాకుండా జాగ్రత్త..

బంగాల్‌ తరహాలో ఇక్కడ కూడా ఆలోచన చేయకుండా చేర్చుకుంటే భ‌విష్యత్​లో తెలంగాణ‌లో కూడా అక్కడి ఫలితాలే పునరావృతమవుతాయనే భావనలో ఉంది. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి వ‌చ్చే నేత‌ల‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తోంది. తెరాసలో గెలుపు అవ‌కాశాలు లేని వారిని కావాల‌నే భాజపాలోకి పంపించి ఆ త‌రువాత తెరాస త‌ర‌ఫున బల‌మైన నేత‌ల‌ను బరిలోకి దింపితే త‌మ ప‌రిస్థితి ఏంట‌ని ఆలోచనలో పడింది. చేరికల విషయంలో క‌నీసం అవ‌గాన లేకుండా చేర్చుకుంటే తెరాస ఉచ్చులో పడినట్లే అవుతుందని కమలనాథులు యోచిస్తున్నారు. బంగాల్‌లోనూ అధికార తృణముల్‌ నుంచి వ‌ల‌స‌ల‌ను ప్రోత్సహించామ‌ని కమలనాథులు భావిస్తే.. మ‌మ‌తా బెన‌ర్జీ పక్కా వ్యూహాంతో భాజపాను చావు దెబ్బకొట్టందన్న చర్చ సాగుతోంది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకే జాగ్రత్త పడుతోంది కాషాయదళం.

అధికారం దిశగా వెళ్తుందా..?

తెలంగాణలో భాజపా ఎదిగేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర నాయకత్వం చేపట్టే ప్రతి పోరాటానికి సహాయ, సహాకారాలు అందిస్తోంది. రాష్ట్ర చేపట్టే పోరాటాల్లో కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు, భాజపా పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. మరి.. తెలంగాణలో వికసిస్తోన్న కమలాన్ని భాజపా రాష్ట్ర నాయకత్వం అధికారం దిశగా తీసుకెళ్తుందా.. లేదో..? వేచి చూడాలి.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.