ETV Bharat / city

ఆపరేషన్ ఆకర్ష్​ను వేగవంతం చేయాలని భాజపా నిర్ణయం - భాజపా తాజా భేటీ

BJP Core committee meeting: రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో సునీల్‌ బన్సల్‌ పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నికలో రణనీతిని అవలంబించాలని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు.

BJP Core committee meeting
BJP Core committee meeting
author img

By

Published : Oct 2, 2022, 12:58 PM IST

Updated : Oct 2, 2022, 1:32 PM IST

BJP Core committee meeting: మునుగోడులో జయకేతనం ఎగురవేయాలన్న పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ గెలుపు వ్యూహాలపై దృష్టిసారించింది. ఇవాళ పార్టీ కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశం జరిగింది. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో ప్రజా గోసా-భాజపా భరోసా, పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాల అమలు వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయనే అంశంపై సమీక్ష నిర్వహించారు.

మునుగోడులో రణనీతి: ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఆపరేషన్ ఆకర్ష్​ను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా బన్సల్ సూచించారు. మునుగోడులో రణనీతి అవలంబించాలని కేంద్ర ప్రభుత్వ పథకాలు, తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.

ఈ నెల 7న మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో భాజపా ఆధ్వర్యంలో బైక్ యాత్రలు చేపట్టనున్నట్లు భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి తెలిపారు. అలాగే 10వ తేదీన బూత్ కమిటీ సభ్యులతో బండి సంజయ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నట్లు పేర్కొన్నారు. కోర్ కమిటీ సమావేశంలో బైక్ యాత్రలో పాల్గొననున్న స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల ఇంఛార్జ్‌లు, పార్టీ ముఖ్యనేతలు.. బూత్ కమిటీలను వెంటనే పూర్తి చేయాలని జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సూచించారని తెలిపారు.

కార్యకర్తల కోసం లీగల్ సెల్: తెరాస మునుగోడులో నకిలీ ఓటర్లను నమోదు చేయిస్తోందని వివేక్ పేర్కొన్నారు. దాంతో నియోజకవర్గ ఓటర్ లిస్టును వెరిఫికేషన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేసీఆర్ అవినీతి, అసమర్థ పాలనను గ్రామగ్రామాన వివరించాలన్నారు. ప్రచారం ఎలా చేయాలి.. ప్రజల్లోకి భాజపా గుర్తును ఎలా తీసుకెళ్లాలనే అంశంపై చర్చించామని వివేక్ వెంకటస్వామి చెప్పారు. అక్రమ కేసులను ఎదుర్కొంటున్న భాజపా కార్యకర్తల కోసం ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఈ భేటీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, వివేక్, విజయశాంతి సహా రాష్ట్ర కీలక నేతలు సమావేశానికి హాజరయ్యారు. దీక్షలో ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశానికి రాలేదు. అల్లుడు చనిపోవడంతో డీకే అరుణ కూడా కోర్ కమిటీ భేటీకి హాజరు కాలేకపోయారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 2, 2022, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.