ETV Bharat / city

Hen birthday celebrations: కోడికి పుట్టినరోజు వేడుకలు.. సోషల్ మీడియాలో వైరల్ - తూర్పుగోదావరి జిల్లాలో పెంపుడు కోడికి పుట్టినరోజు వేడుకలు

Hen birthday celebrations: పెంపుడు జంతువులకు అట్టహాసంగా జన్మదిన వేడుకలు జరిపిన సంఘటనలు తరచూ చూస్తుంటాం. తాజాగా ఓ యువకుడు కోడికి పుట్టిన రోజు వేడుక జరిపించాడు. ఈ వింత జన్మదిన వేడుకలు ఎక్కడ జరిగాయో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ స్టోరీ చదివేయండి.

Hen birthday celebrations
కోడిన పుట్టినరోజు వేడుకలు
author img

By

Published : Jul 2, 2022, 4:22 PM IST

birthday celebrations for hen: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పీరా రామచంద్రపురం గ్రామానికి చెందిన ఉదయ భాస్కర్‌.. తమ బంధువుల నుంచి 5 నాటు కోడిగుడ్లు తీసుకొచ్చి వాటిని వెంటిలేషన్​పై పొదిగించాడు. అయితే.. అందులో ఒక్క కోడిపిల్ల మాత్రమే బతికింది. ఒక్కగానొక్క ఆ కోడిపిల్లకు "మోటు" అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. గతేడాది చెన్నైలో ఉండడంతో అక్కడే మోటుకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాడు.

డిన పుట్టినరోజు వేడుకలు

ఈ ఏడాది స్వగ్రామం రామచంద్రపురం రావడంతో రెండో పుట్టిన రోజు వేడుకను అక్కడే నిర్వహించాలని భావించాడు. అనుకున్నట్లుగా.. కోడికి గౌను కుట్టించి, గొలుసులు వేసి 2వ పుట్టినరోజును ఘనంగా జరిపాడు. ఉదయ భాస్కర్‌ స్నేహితులు.. 'మోటు'తో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా ఆ వేడుకలో పాల్గొన్నారు. మే 11న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.