గల్వాన్ లోయలో చైనా సైనికులతో హోరాహోరీ పోరాడిన బిహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్ హైదరాబాద్ తరలనుంది. జూన్ 15 నాటి ఘర్షణలో తెలంగాణవాసి కర్నల్ సంతోష్ బాబు సహా బెటాలియన్‌కు చెందిన 20 మంది సైనికులు మృతిచెందిన సంగతి తెలిసిందే. మార్చి-ఏప్రిల్‌లోనే తూర్పులద్ధాఖ్‌లో రెండున్నరేళ్ల విధులను ఈ బెటాలియన్ పూర్తి చేసింది.
ఆ సమయంలోనే శాంతియుత ప్రాంతానికి తరలాలి. కరోనా కారణంగా ఆలస్యమైంది. అంతలోనే చైనాతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పరిస్థితులు మెరుగవ్వడంతో ఇప్పుడు హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ బెటాలియన్ స్థానాన్ని బిహార్ రెజిమెంట్‌కే చెందిన మరోదళం భర్తీచేయనుంది.
ఇవీ చూడండి: లాక్‌డౌన్ ఎత్తివేతతో పుంజుకుంటున్న వ్యాపారలావాదేవీలు