ప్రాజెక్టుల సాధన పేరుతో పాదయాత్ర చేయనున్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 20నుంచి 26వ వరకు నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల నుంచి హైదరాబాద్ ఈఎన్‌సీ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్టు వివరించారు. ఈ మేరకు అనుమతి కోరుతూ ఎన్నికల కమిషన్, ఎస్‌పీకి లేఖ రాసినట్లు ఎంపీ స్పష్టం చేశారు. వేలాది మందితో 120 కిలోమీటర్లు... 6 రోజులుపాటు పాదయాత్ర ఉంటుందని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ మీద ప్రేమ ఉన్నట్లు వ్యవహారిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో 2008లో ప్రారంభించిన బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుకు రూ.100కోట్లు ఇస్తే పూర్తవుతుందన్నారు. ఇప్పటికే ఎస్ఎల్బీసీ సొరంగమార్గానికి రూ.1300 కోట్లు ఖర్చు చేశామని... మరో వెయ్యి కోట్లు ఇస్తే పూర్తి అవుతుందని వివరించారు. సొరంగమార్గం ఉంటే ఏపీకి జగన్ నీళ్లు తీసుకవెళ్లేవారు కాదని... కాంగ్రెస్కు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి పేరు వస్తుందనే ఆ రెండు ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టారని ఆరోపించారు. శాంతియుతంగా చేసే పాదయాత్రకు రైతులు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు.
ఇదీ చూడండి: షర్మిల ఖమ్మం పర్యటన వాయిదా