కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని... భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిల్లీలో కలిశారు. నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ వరకు... జాతీయ రహదారి-565 పనుల కోసం 200 కోట్లు, జాతీయ రహదారి-65 విస్తరణ పనుల కోసం 350 కోట్లు కేటాయించినందుకు గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. డీపీఆర్‌ను సిద్ధం చేసి, పనులు ప్రారంభించేలా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

వలిగొండ, తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్, ఇల్లందు మీదుగా... హైద్రాబాద్-కొత్తగూడెం మధ్య రహదారిని జాతీయ రహదారిగా గుర్తించారు. అయినప్పటికీ నిర్వహణ సరిగా లేక... మరమ్మతులకు నోచుకోవడం లేదని మంత్రికి వివరించారు. హైదరాబాద్-విశాఖ-ఛత్తీస్గడ్ మధ్య 100 కిలో మీటర్లు తగ్గించే... ఈ రహదారి ఎంతో ఉపయోగకరమని చెప్పారు. 2016లోనే డీపీఆర్ తయారు చేసినా.. నేటికీ పనులు మొదలు కాలేదన్నారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ నిర్ణయాలే అమలు చేయండి: ముఖ్యమంత్రి