జమ్మూకు సమీపంలోని మజీన్ గ్రామం వద్ద తితిదే నిర్మించనున్న శ్రీవారి ఆలయ నిర్మాణానికి(srivari temple at jammu)... ఈ నెల 13న భూమిపూజ చేయనున్నారు. భూమిపూజ ఏర్పాట్లపై ఈవో జవహర్ రెడ్డి పద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయంతో పాటు, ముఖమండపం, ప్రాకారం, శ్రీవారి పోటు, యాత్రికుల వసతి సముదాయం, వాహన మండపం, అర్చకుల వసతి గృహం, సిబ్బంది వసతి గృహాలు, వేద పాఠశాల నిర్మాణాలకు సంబంధించి ఇంజినీరింగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
పనులను రెండు దశలుగా విభజించాలని, ఆలయం ప్రాంగణంలోని నిర్మాణాలన్నీ రాతితో చేయాలని ఈఓ సూచించారు. ప్రహరీ గోడ ఎత్తుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 13వ తేదీ స్థానికంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జేఈవో సదా భార్గవి, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ : Uttam: ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి... చికిత్స చేయాలి