ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ను నియమిస్తూ...రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్‌ను కేంద్రం నియమించింది. 2009 నుంచి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా నరసింహన్ కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో బిశ్వభూషణ్ నియమితులయ్యారు. ఒడిశా భాజపా అధ్యక్షుడిగా హరిచందన్ పని చేశారు. ఆయన ప్రముఖ న్యాయవాది. గతంలో జనసంఘ్, జనతా పార్టీలోనూ పని చేశారు.
- ఇదీ చూడండి : సుప్రీంలో 'కర్ణాటకీయం' రేపటికి వాయిదా!