Bheemla nayak: ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాలలో 'భీమ్లానాయక్' సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద పవన్ పవన్ కల్యాణ్ అభిమానుల సందడి చేస్తున్నారు. థియేటర్ల ప్రాంగణమంతా పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలతో నింపేశారు. ఓ అభిమాని చేతిలో కర్పూరం వెలిగించుకుని జై పవన్ అంటూ నినాదాలు చేశాడు.
అర్థరాత్రి నుంచే సందడి..
అర్దరాత్రి నుంచే అభిమానులు థియేటర్ల వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది. పవన్ కల్యాణ్ జిందాబాద్.. కాబోయే సీఎం అంటూ అరుపులు కేకలతో హోరెత్తించారు. ఏపీ ప్రభుత్వం జనసేనాని పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఫిరంగిపురంలో థియేటర్‌పై రాళ్లు..
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు. భీమ్లానాయక్ బెనిఫిట్ షో ఉందంటూ ఈశ్వరసాయి థియేటర్లో ముందుగా టికెట్లు విక్రయించారు. సినిమా ప్రదర్శించకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. ఒకో టిక్కెట్ రూ.300 నుంచి 500 వందలు దాకా తీసుకున్నట్లు తెలిసింది. ఉదయం 10.30 గంటలకు షో ఉంటుందని.. ఆ ఆటకు టికెట్లు ఉపయోగించుకోవాలని థియేటర్ యాజమాన్యం సూచించింది. కోపంతో థియేటర్‌పై రాళ్లు రువ్వారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దు మణిగింది.
సినిమా కోసం యానాంకు..
ఏపీలో బెనిఫిట్ షోకు అనుమతి లేకపోవడంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పవన్ అభిమానులు తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో చిత్రాన్ని వీక్షించేందుకు వచ్చారు. యానాంలోని రెండు థియేటర్లలో ప్రత్యేక ప్రదర్శన వేయడంతో ప్రధాన రహదారి అంతా జనంతో కిటకిటలాడింది. వెండితెరపై పవన్ కల్యాణ్ కనిపించగానే అభిమానులు కేరింతలు కొట్టారు.
ఇదీ చదవండి: