ETV Bharat / city

Indhrakeeladri: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీ భక్తులు.. వీఐపీ దర్శనాలు రద్దు - vijayawada temple rush

ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. మాలధారులు భారీగా తరలి వస్తుండటంతో క్యూలైన్లు రద్దీగా మారాయి. దీనితో అమ్మవారి దర్శనం ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Indhrakeeladri: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీ భక్తులు.. వీఐపీ దర్శనాలు రద్దు

author img

By

Published : Oct 16, 2021, 4:43 PM IST

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీ భక్తులు

ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై అరుణవర్ణం ప్రకాశిస్తోంది. దుర్గమ్మ దర్శణం కోసం భవానీ భక్తులు భారీగా పోటెత్తుతుండడంతో 'జై భవానీ' నామస్మరణ మారుమోగుతోంది. వీరిలో చాలామంది అమ్మవారిని విజయదశమి రోజునే దర్శించుకున్నారు. అయితే విజయదశమి రోజు శుక్రవారం కావడంతో మాల తీయలేకపోయారు. ఇవాళ అమ్మవారిని దర్శించుకుని మాల తీస్తున్నారు.

దీనితో కృష్ణా తీరంలో భవానీల సందడి అధికంగా కనిపిస్తోంది. నిన్నటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ అంతకంతకూ పెరిగిపోతుండడంతో ప్రముఖులు, ప్రొటోకాల్‌ దర్శనాలపై అధికారులు ఆంక్షలు విధించారు. రెండు రోజులపాటు వీఐపీ, కాల్ దర్శనాలు రద్దు చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్​ తెలిపారు. ఈ నిర్ణయంతో భక్తులందరికీ సాధారణ దర్శనాలే అందుబాటులో ఉన్నాయి. మరోవైపు కనకదుర్గమ్మ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొండపైకి వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు. భవానీలు భారీగా వస్తుండడంతో.. ప్రసాదం కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. మొత్తం 12 కౌంటర్ల ద్వారా ప్రసాదం అందిస్తున్నారు.

ఇదీ చదవండి:

నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.