గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో... భారతమాత మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
గర్వపడేలా పౌరులు పాటుపడాలి: గవర్నర్
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై రిపబ్లిక్‌డే శుభాకాంక్షలు తెలిపారు. దేశం గర్వపడేలా పౌరులు పాటుపడాలని పేర్కన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు కాపాడటం కోసం ఈ తరహా కార్యక్రమాలు ఆవశ్యకమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమం మూడో ఏడాది కొనసాగిస్తాన్న కిషన్‌రెడ్డి చొరవను అభినందించారు.
యువతలో దేశభక్తిని పెంపొందించాలి: కిషన్‌రెడ్డి
నేటి యువతలో జాతీయభావం, దేశభక్తి పెంపొందించాల్సిన అవసరముందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మనదేశాన్ని ప్రపంచంలోనే శక్తిశాలి దేశంగా అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని తెలిపారు.
ఇవీ చూడండి: రాజ్‌భవన్‌లో ఎట్‌హోం... సీఎం సహా ప్రముఖుల హాజరు