ప్రముఖ ఫార్మాదిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న కొవాగ్జిన్‌కి సంబంధించిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోసం 25800 మంది వాలంటీర్లు నమోదు చేసుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
తమపై నమ్మకం ఉంచి ట్రయల్స్‌లో పాల్గొంటున్న వారికి సుచిత్ర కృతజ్ఞతలు తెలిపారు. కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం నిరంతరంగా కృషి చేస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు. భారత్ బయోటెక్‌కి ఇప్పటికే డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన విషయం తెలిసిందే.