కొవిడ్ టీకాల పంపిణీలో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఎక్కువ డోసులు అందించాలని భారత్ బయోటెక్ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల కలిశారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు టీకాల విషయమై భారత్ బయోటెక్ ప్రతినిధులతో చర్చించారు.
కొవిడ్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్న సీఎస్... అందుకోసం రాష్ట్రానికి ఎక్కువ డోసులను సరఫరా చేయాలని, అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భారత్ బయోటెక్ సీఎండీని కోరారు. రాష్ట్రానికి ఎక్కువ డోసులిచ్చేందుకు భారత్ బయోటెక్ సానుకూలంగా స్పందించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, భారత్ బయోటెక్ డైరెక్టర్ డాక్టర్ సాయి ప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు.
ఇవీచూడండి: 'మల్లెపువ్వు వాసన, మామిడి పండు రుచి తెలిస్తే.. కరోనా లేనట్టే'