ETV Bharat / city

బంజరు భూమిలో... బంగారం పండించింది! - వన్నూరమ్మకు ప్రధాని మోదీ ప్రశంసలు

ఊహ తెలియని వయసులోనే పెళ్లి.. ప్రపంచాన్ని అర్థం చేసుకునేలోపే పెనిమిటి అకాల మరణం.. నలుగురు బిడ్డల పెంపకాన్ని తలకెత్తుకుని ఒంటరిగా జీవిత పోరాటం మొదలుపెట్టింది వన్నూరమ్మ. తాతల నాటి బంజరు భూమిని సాగులోకి తీసుకొచ్చి బంగారు పండించడం మొదలు పెట్టారామె. బీడుగా ఉన్న ఆ భూమిలో పంటలు సాగు ఎలా చేసుకోవాలో తెలియని పరిస్థితి. అయినా పట్టుదలతో ఎన్నో విషయాలు నేర్చుకుని మహిళా రైతుగా విజయవాడలో అవార్డు అందుకున్న.. వన్నూరమ్మ నేడు ప్రధాని ప్రశంసలు అందుకుంది.

vijayawada women received best farmer award
ఉత్తమ మహిళా రైతుగా విజయవాడకు చెందిన వన్నూరమ్మ
author img

By

Published : May 16, 2021, 5:09 PM IST

బీడుగా ఉన్న ఆ భూమిలో పంటలు సాగు ఎలా చేసుకోవాలో తెలియని పరిస్థితి. అయినా పట్టుదలతో ఎన్నో విషయాలు నేర్చుకుని మహిళా రైతుగా విజయవాడలో అవార్డు అందుకున్న.. వన్నూరమ్మ కథ ఇది.

తన పిల్లలతో పాటు చదివి

వన్నూరమ్మది ఏపీలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామం. చిన్నవయసులోనే వివాహం చేసుకున్న వన్నూరమ్మ మొదట ఏడో తరగతి వరకే చదివింది. కానీ ఇరవై సంవత్సరాల తర్వాత చదువుపై మక్కువ పెంచుకున్నారు. తన పిల్లలతో పాటు చదివి 2010లో పదో తరగతి పరీక్షలు రాశారు. తర్వాత కదిరిలో డిగ్రీ పూర్తి చేశారు. 2007లో దురదకుంటలో గ్రామ సంఘానికి ఎంపికయ్యారు. 2007లో గ్రామ సంఘం లీడరుగా, అనంతరం మండల సమాఖ్య లీడరుగా మూడేళ్లు పని చేశారు. బీమామిత్రగా కంబదూరు, కుందుర్పి, శెట్టూరు మండలాల్లో పని చేశారు.

సీఎస్‌పీగా ఎనిమిది సంవత్సరాలు పని చేశారు. వీటన్నింటికంటే తాతల నాటి బంజరు భూమిని సాగులోకి తీసుకొచ్చి బంగారు పండించడం మొదలు పెట్టారామె. ప్రభుత్వం ఇచ్చిన నాలుగున్నర ఎకరాల భూమి అది. ‘అమ్మానాన్నలకు ఒక్కదాన్నే కూతుర్ని కావడంతో ఆ భూమిని నాకు ఇచ్చారు. అంతకు ముందు బీడుగా ఉన్న ఆ భూమిలో పంటలు సాగు ఎలా చేసుకోవాలో తెలియని పరిస్థితి. అయినా పట్టుదలతో ఎన్నో విషయాలు నేర్చుకుని మహిళా రైతుగా విజయవాడలో అవార్డు అందుకున్నాను. ఆర్డీటీ ఆధ్వర్యంలో అమెరికా ప్రభుత్వ అవార్డునీ అందుకున్నా’ అని వివరించారు వన్నూరమ్మ.

కష్టం సాగిందిలా...

అనంతపురంలో వర్షాలు తక్కువ కాబట్టి ప్రకృతి వైపు మొగ్గు చూపారు వన్నూరమ్మ. ‘ప్రకృతి వ్యవసాయ డీపీఎం లక్ష్మానాయక్‌ గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న బంజరు భూములను పరిశీలించారు. ఆయన ప్రోత్సహించి ఈ భూముల్లో ప్రకృతి వ్యవసాయం చేయమని ధైర్యం చెప్పారు. అప్పటి నుంచి బీడు భూమును బాగు చేసేందుకు ఒంటరిగానే కృషి చేశాను’ అంటారు వన్నూరమ్మ. 2018లో మొదటిసారి నవధాన్యాలు, వేరుసెనగ, కూరగాయల సాగుకు రూ.27వేలు ఖర్చు చేసి ఏడాదిలో మూడు పంటలు రాగా సుమారుగా రూ.1.07 లక్షలు లాభం వచ్చింది.

రెండో సంవత్సరంలో కూడా వేరుసెనగ, కూరగాయలు పంటలు సాగు చేస్తే రూ.1.50 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం నవధాన్యాలు సాగు చేశారు. తను చేయడంతోపాటు నియోజకవర్గంలోని వంకతండా గ్రామంలో 170 మంది మహిళలను ప్రోత్సహించి వారితో 220 ఎకరాల భూమిలో ప్రకృతి వ్యవసాయం చేయిస్తున్నారు. ఇప్పుడు వారంతా ఆరోగ్యకరమైన పంటలు సాగు చేస్తున్నారు. ఈ విషయాలు అధికారుల ద్వారా తెలుసుకున్న ప్రధాని మోదీ శుక్రవారం దృశ్యమాధ్యమం ద్వారా మాట్లాడి వన్నూరమ్మను ప్రశంసలతో ముంచెత్తారు.

దేశ ప్రధానితో మాట్లాడతానని కలలో కూడా అనుకోలేదు. దేశానికే ఆదర్శంగా ఉండి మహిళల సత్తాచాటి చెప్పావని ప్రధాని అనడం అదృష్టం. 200 మంది మహిళలతో ప్రకృతి వ్యవసాయం చేయించి నాలా ప్రశంసలు అందుకునేలా చేయాలని నిర్ణయించుకున్నాను. కలెక్టర్‌తో మాట్లాడినప్పుడు కూడా ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తే ప్రభుత్వం అందించే భరోసా కూడా అక్కర్లేదని చెప్పాను. ఎందుకిలా అన్నావని ఆయన అడిగారు. ప్రకృతిసేద్యంతో ఎవరిపై ఆధారపడకుండా వ్యవసాయం చేసుకోవచ్చని తెలిపాను.

ఇవీచూడండి: నాలుగు రాష్ట్రాల సీఎంలతో మోదీ సంభాషణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.