ETV Bharat / city

రెండు లక్షల గాజులతో ముస్తాబైన బెజవాడ ఇంద్రకీలాద్రి - AP updates

ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయాన్ని గాజులతో అలంకరించారు. కార్తిక శుద్ద విదియ సందర్భంగా రెండు లక్షల గాజులతో ఆలయ ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు.

bejawada-kanaka durgamma-temples-decoration with two lakhs bangles
రెండు లక్షల గాజులతో ముస్తాబైన బెజవాడ ఇంద్రకీలాద్రి
author img

By

Published : Nov 16, 2020, 10:20 PM IST

కార్తిక శుద్ద విదియను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వివిధ వర్ణాల గాజులతో దుర్గమ్మను అలకరించారు. ఏటా పది లక్షలకుపైగా గాజులతో ఆలయ ప్రాంగణాన్ని అలకరిస్తుంటారు. కానీ ఈసారి కొవిడ్‌ కారణంగా దాతల నుంచి విరాళంగా వచ్చిన రెండు లక్షల గాజులతో ఆలయ ప్రాంగణం వరకే అలంకరించారు. ఈ అలంకరణ కోసం మహిళలు గాజులను దండలుగా చేశారు.

ఇవాళ ఉదయం ఐదు గంటల నుంచి గాజుల అలంకరణలో అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. కార్తిక మాసం ప్రారంభం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారి దర్శనంతోపాటు మల్లేశ్వరస్వామిని దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు చేయించుకున్నారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి పూజించేందుకు మహిళలు ఎక్కువ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

ఇదీ చూడండి:జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడం ఖాయం: డీకే అరుణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.