కరోనా నేపథ్యంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తిండిలేక ఇబ్బంది పడుతున్నవారెందరో ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్ కుల్లూలో ఉంటున్న ఓ ఇద్దరు వ్యక్తులు.. యాచకులుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. రోజూ భిక్షాటన చేస్తూ.. పొట్ట నింపుకొంటారు. ఆకలి బాధ ఎంటో తెలిసిన ఆ యాచకులు అడుక్కుంటూ పోగుచేసిన నగదును సామాజిక సేవకు వినియోగించారు. వారి సమీపంలో ఉండే ప్రాంతాల వారికి ఆహార సరకులు అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రత్నం (ఫొటోలో గడ్డంతో ఉన్న వ్యక్తి), హిమాచల్‌ప్రదేశ్‌కి చెందిన బాబా అనే ఇద్దరు వ్యక్తులు.. 20 సంవత్సరాల నుంచి హిమాచల్‌ప్రదేశ్ కుల్లూలో భిక్షాటన చేస్తూ బతుకుతున్నారు. కులూలో ఏ పేదలూ ఆకలితో ఉండకూడదని జిల్లాలో ఉన్న అన్నపూర్ణ అనే సంస్థకు మద్దతుగా వారిద్దరూ 50 కిలోల పిండి, 50 కిలోల బియ్యం, 10 కిలోల పప్పులు.. ఇతర సామగ్రిని అందజేశారు. వారికే తినడానికి లేకపోయినా.. సామాజిక సేవ చేస్తూ అందరిలో స్పూర్తిని పంచుతున్నారు.