ETV Bharat / city

కొవిడ్‌ రోగులతో ప్రభుత్వాసుపత్రులు కిటకిట - COVID HOSPITALS PROBLEMS IN AP

ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా కరోనా వ్యాప్తితో... రోగులతో ప్రభుత్వాసుపత్రులు నిండిపోయాయి. వీరి తాకిడికి తగ్గట్లుగా పడకలు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో పడకల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన బాధితులు ప్రభుత్వాసుపత్రుల్లో పడకల కోసం వేచి చూడాల్సి వస్తోంది.

ap covid hospitals, ap corona news
కొవిడ్‌ రోగులతో ప్రభుత్వాసుపత్రులు కిటకిట
author img

By

Published : May 1, 2021, 11:18 AM IST

కొవిడ్‌ రోగులతో ప్రభుత్వాసుపత్రులు కిటకిట

ఆంధ్రప్రదేశ్​వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు నానాటికీ ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కరోనా బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. వీరి తాకిడికి తగ్గట్లుగా పడకలు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో పడకల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన బాధితులు ప్రభుత్వాసుపత్రుల్లో పడకల కోసం వేచి చూడాల్సి వస్తోంది. ఒకవైపు ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతున్నా... పడకలు లభించక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారు ఆసుపత్రుల గేట్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు.

విజయవాడ, గుంటూరు, విశాఖ, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో పడకల పరిస్థితిని ‘ఈనాడు బృందం’ పరిశీలించగా ఇటువంటి దృశ్యాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి బయటకు వచ్చే వారు తక్కువగా ఉంటుండగా... చేరాల్సిన వారు ఎక్కువగా ఉంటున్నారు. దాంతో పరిస్థితులు రాను రాను దయనీయంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ యంత్రాంగం మూడుగంటల్లోగా పడకలు ఇచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నా... డిశ్ఛార్జిలు తక్కువగా ఉండడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రియల్‌టైమ్‌ వెబ్‌సైట్‌లో మాత్రం అన్ని ఆసుపత్రులకు సంబంధించి పడకలు ఖాళీగా ఉన్నాయని చూపిస్తున్నారు. పడకల వివరాల నమోదులో జాప్యం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు, కార్పొరేట్‌ అసుపత్రుల్లో పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయి.

జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందంటే...
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ప్రతి రోజు పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. స్విమ్స్‌లో తొలుత 450 పడకలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కేసులతో పాటు తీవ్ర అస్వస్థతకు గురవుతున్న వారు పెరుగుతుండటంతో అదనంగా 150 పడకలను అందుబాటులోకి తెచ్చారు. మొత్తం 600లో 500 పడకలకు ఆక్సిజన్‌ సదుపాయం ఉంది. వైరస్‌ తీవ్రంగా ఉన్న వారిని స్విమ్స్‌కు తరలిస్తున్నారు. పడకలు ఖాళీగా లేనందున అవసరమైన వారికి ఆక్సిజన్‌ను హెల్ప్‌డెస్క్‌ ప్రాంతంలోనే అందిస్తున్నారు. వైద్యులు అక్కడికే వచ్చి చికిత్స చేస్తున్నారు. మరో 175 పడకలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. రుయాలో మొత్తం 890 పడకలు ఉన్నాయి. ఇందులో 135 ఐసీయూ, 465 ఆక్సిజన్‌తో ఉన్న నాన్‌ ఐసీయూ, 290 సాధారణ కేటగిరికి చెందినవి. ప్రస్తుతం అత్యవసర బెడ్లు అన్నీ పూర్తిగా నిండిపోయాయి. తాకిడి పెరిగిపోతుండడంతో కొందరిని పక్కనే ఉన్న ఆయుర్వేద ఆసుపత్రికి తరలిస్తున్నారు. రుయాలో అదనంగా 250 పడకలు పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. తిరుపతిలో స్విమ్స్‌, రుయాతో పాటు ఈఎస్‌ఐ, ఆయుర్వేద ఆసుపత్రి, శ్రీపద్మావతి నిలయం, శ్రీనివాసం, విష్ణునివాసం అతిథి గృహాలను కొవిడ్‌ కేర్‌ కేంద్రాలుగా మార్చారు. చంద్రగిరిలోని ఆసుపత్రిలో 100, నారావారిపల్లిలోని పీహెచ్‌సీలో 50 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.

కొత్త కేంద్రాల కోసం అన్వేషణ

ఏపీలోని గుంటూరు జీజీహెచ్‌లో ఉన్న మొత్తం 1,080 పడకలూ బాధితులతో నిండాయి. మరో పక్క ఇక్కడకు జిల్లా నలుమూలల నుంచి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రత్యామ్నాయంగా గుంటూరులోని రైల్‌ మహాల్‌, కల్యాణమండపాలు, తదితర చోట్ల బాధితులను ఉంచేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు.

ఏపీ విజయవాడ జీజీహెచ్‌లో ఉన్న 750 పడకలు దాదాపు నిండిపోయాయి. డిశ్ఛార్జిలు, మరణాలు జరిగితే...వెంటనే ఆ మేరకు మాత్రమే పడకలు భర్తీ అవుతున్నాయి. ఇక్కడ 300 మంది బాధితులకు సరిపడా సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. 750 మందికి పైగా రోగులను చూడాల్సి రావడంతో వైద్యసేవలపైనా ప్రభావం పడుతోంది. ఆసుపత్రికి సమీపంలోని కల్యాణ మండపాలు, పెద్ద హాళ్లు అందుబాటులో ఉన్నాయేమోనని పరిశీలిస్తున్నారు.

ఏపీ విశాఖ నగరంలోని కేజీహెచ్‌లో ఐసీయూ పడకలు 100కు గాను 97, ఆక్సిజన్‌ బెడ్లు 340కి గాను 340, అనకాపల్లిలో ఆక్సిజన్‌ విభాగంలో 50కి 44, సాధారణ వార్డుల్లో 35కి 34 పడకలు భర్తీ అయ్యాయి. విశాఖలోని టీబీ ఆసుపత్రిలో కొన్ని పడకలు ఖాళీగా ఉన్నాయి.

డిశ్ఛార్జ్‌ డ్రైవ్‌ ప్రారంభం
ఆసుపత్రిల్లో రద్దీ తగ్గించేందుకు శుక్రవారం నుంచి నెల్లూరు జిల్లాలో ‘డిశ్ఛార్జి డ్రైవ్‌’ను అధికారులు ప్రారంభించారు. ఇందులోభాగంగా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన వారిని గుర్తించి వెంటనే డిశ్ఛార్జి చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి రెండు రోజులు క్వారంటైన్‌ సెంటర్‌లో ఉండాలని సూచిస్తున్నారు. దాంతో గత రెండు రోజుల్లో కొవిడ్‌ సంరక్షణ కేంద్రాల్లో ఉండే బాధితుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో కొవిడ్‌ చికిత్సను అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు 44 ఉన్నాయి.

వీటిలో మొత్తం 2,781 పడకలు ఉండగా.. శుక్రవారం మధ్యాహ్నం నాటికి 653 పడకలు ఖాళీగా ఉన్నాయి. ఐసీయూలో 494 పడకలు ఉండగా.. 349లో రోగులు చికిత్స పొందుతున్నారు. 1154 ఆక్సిజన్‌ (నాన్‌ ఐసీయూ) పడకలు ఉండగా.. 31 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. దాంతో జీజీహెచ్‌లో మరో వంద పడకలను ఏర్పాటు చేశారు. వీటికి ఆక్సిజన్‌ పైపులైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

నారాయణ ఆసుపత్రిలో 100 ఐసీయూ పడకలు ఉన్నాయి. మరో 300 పడకలకు అన్ని ఏర్పాట్లు ఉన్నా.. ఆక్సిజన్‌ సరఫరాకు ‘ఒత్తిడి’ సరిపోదని చెప్పడంతో.. కలెక్టర్‌ చక్రధర్‌బాబు వెంటనే అదనపు పైపులైను లాగాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్లలోనూ ఆక్సిజన్‌ సిలెండర్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జీజీహెచ్‌, నారాయణ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ పడకలను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నామని, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఆక్సిజన్‌ సిలెండర్లను అందుబాటులో ఉంచుతున్నామని జిల్లా సంయుక్త కలెక్టర్‌ తెలిపారు.

రెండు మూడు రోజుల్లో అందరికీ పడకలు
దీనిపై అధికార వర్గాలు మాట్లాడుతూ...‘కొందరు అవసరం లేకున్నా ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. దాంతో అత్యవసరమైన వారికి పడకలు దొరకడంలో సమస్యలు వస్తున్నాయి. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరం లేని వారిని డిశ్చార్జి చేసేందుకు, కొవిడ్‌ కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెండు మూడు రోజుల్లో అవసరమైన వారి అందరికీ పడకలు అందుబాటులో వస్తాయి. కొన్ని చోట్ల అదనంగా పడకలు ఏర్పాటు చేస్తున్నాం...’ అని వివరిస్తున్నారు.

ఇవీ చదవండి: భూముల కబ్జాపై అనిశా, విజిలెన్స్ విచారణ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.