Man saved from drowning in RK Beach: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో స్నానానికి దిగిన ఓ వ్యక్తి అలల తీవ్రతకు కొట్టుకుపోతుండగా.. బీచ్‌లోని పోలీసులు, కమ్యూనిటీ గార్డులు కాపాడారు. హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల మహమ్మద్ అబ్దుల్ నయీమ్.. స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లారు. తుపాన్ నేపథ్యంలో.. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో సముద్రంలో దిగిన నయీమ్ కొట్టుకుపోతుండగా.. పోలీసులు డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించారు. గజ ఈత గాళ్ల ద్వారా ఆ వ్యక్తిని కాపాడారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించి.. అబ్దుల్‌ను కాపాడిన సిబ్బందిని స్థానికులు అభినందించారు.
ఇదీచూడండి: Ongole Bulls in Akhanda Movie : దుమ్మురేపిన ఒంగోలు గిత్తలు.. వెండితెరపై రంకెలు